కొత్తకోట, ఆగస్టు 2 : వనపర్తి జిల్లా కొత్తకోట ఎస్సై శివానంద్‌గౌడ్ కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తట్టుకోలేక బదిలీపై వెళ్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. శివానంద్‌గౌడ్ గత ఏప్రిల్ 9న కొత్తకోట ఎస్సైగా విధుల్లో చేరారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేయనందు కే గతంలో ఉన్న ఎస్సై ఆనంద్ రెండేం డ్లు గడువకముందే బదిలీ చేయించినట్టు సమాచారం. వారి అక్రమాలకు చూసీచూడనట్టు ఉంటేనే ఉద్యోగం చేయాల ని.. లేనిపక్షంలో బదిలీ చేయిస్తామని ఒత్తిడి చేయడంతో అందుకు ససేమిరా అ న్న ఆనంద్‌ను కాంగ్రెస్ నాయకులు.. ని యోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి ద్వా రా బదిలీ చేయించినట్టు తెలిసింది.
కొత్త గా వచ్చిన ఎస్సై శివానంద్గౌడ్పైనా ఒ త్తిడి పెంచడంతో ఆయనే బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. శివానంద్ 4 నెలలు కాకముందే బదిలీపై వెళ్తుండటం చర్చనీయాంశమైంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా.. ఎస్సై శివానంద్‌గౌడ్ తండ్రి ఆరోగ్యం బాగా లేనందున మహబూబ్‌నగర్‌కు బదిలీపై వెళ్తున్నట్టు తెలిసిందని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులపై కాంగ్రెస్ చేస్తున్న ఒ త్తిళ్లు తెలియదని చెప్తున్నారు. బదిలీపై వె ళ్తున్న ఎస్సై శివానంద్‌గౌడ్ స్థానంలో హై దరాబాద్ నుంచి విక్రం వస్తున్నట్టు స మాచారం ఉన్నదని వారు పేర్కొన్నారు. గతంలో కొత్తకోట తహసీల్దార్లుగా పనిచేసిన వెంకటేశ్వర్లు, చాంద్‌పాషా సైతం కాంగ్రెస్ ఒత్తిళ్ల కారణంగానే బదిలీ అయ్యారని చర్చించుకుంటున్నారు.