TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
TVK : వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
TVK : వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. తమిళనాడులో రెండు అసెంబ్లీ స్తానాలకు జరిగిన ఎన్నికల్లో టీవీకే విజయం సాధించింది. ఇక, పుదుచ్చేరిలోని తట్టంచవాడి అసెంబ్లీకి జరిగిన ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ (ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్) అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు.
అసోంలోని నాగోవో పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మొత్తం ఒక పార్లమెంట్ స్థానానికి, ఐదు అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరిగింది. ఇందులో పశ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ సీట్లను అధికార బీజేపీ దక్కించుకుంది. రెజినగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి శంఖారావ్ సర్కార్, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హసిరానీ రత్ విజయం సాధించారు. తమిళనాడులో కూడా రెండు అసెంబ్లీ స్తానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీవీకే కూటమి పార్టీ అభ్యర్థులే గెలిచారు.
విజయ్ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మధురాంతకం అసెంబ్లీ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి మరగతం కుమారవేల్, ధారాపురం నుంచి టీవీకే అభ్యర్థి సత్యభామ గెలుపొందారు. తమిళనాడులో డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచారు. బెంగాల్లో రెండు అసెంబ్లీ సీట్లు గెలవడం, అసోంలో పార్లమెంట్ సీట్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలు తమకు వరుసగా మద్దతుగా నిలుస్తూ, తమను ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో స్పందించారు. పశ్చిమ బెంగాల్లో, అసోంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి పాలనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే భాగస్వామి ఏఐఎన్ఆర్సీ గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విజయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ప్రజలు ఇండియా బ్లాక్ కూటమిని మరోసారి తిప్పికొట్టారని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dharapuram
- P Sathyabama
- TVK
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

