Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
కోరుట్ల, అక్టోబర్ 09: కోరుట్ల మున్సిపల్ పరిధి యకిన్ పూర్ గ్రామంలోని విద్యార్థులు పోస్ట్ కార్డులు ఉద్యమానికి తెరతీశారు. తమ పాఠశాలలో హిందీ సబ్జెక్టు భోదించే ఉపాధ్యాయులు లేరనే విషయాన్ని ముఖ్యమంత్రకి తెలియజేసేందుకు వారు లేఖలు రాశారు.
కోరుట్ల, అక్టోబర్ 09: కోరుట్ల మున్సిపల్ పరిధి యకిన్ పూర్ గ్రామంలోని విద్యార్థులు పోస్ట్ కార్డులు ఉద్యమానికి తెరతీశారు. తమ పాఠశాలలో హిందీ సబ్జెక్టు భోదించే ఉపాధ్యాయులు లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసేందుకు వారు లేఖలు రాశారు. వెంటనే తమ బడికి హిందీ టీచర్లను నియమించాలని విద్యార్థినులు లేఖాస్త్రంతో సీఎంకు విజ్ఞప్తి చేశారు.
యకిన్ పూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో హిందీ టీచర్ నియామకం కోరుతూ పదో తరగతి విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాశారు. 2025-26 విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినా తమ బడిలో హిందీ టీచర్ లేరనే విషయాన్ని వారు వినూత్నంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం తపాలా దినోత్సవాన్ని పునస్కరించుకొని.. తమ పాఠశాలకు వెంటనే హిందీ టీచర్‌ను నియమించాలని పదో తరగతి విద్యార్థులు విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్న సీఎంకు పోస్ట్ కార్డులు పంపారు.
‘మాబడికి హిందీ టీచర్ నియమించాలని ఇప్పటికే కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాం. ఆ వినతిపత్రం ఇచ్చి కూడా మూడు నెలలు అవుతంది. అయినప్పటికూ ఇంతవరకు మా స్కూల్‌కు హిందీ టీచర్లను నియమించలేదు’ అని లేఖలో పేర్కొన్న విద్యార్థులు.. తమ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

