IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
IND vs WI : రాంచీ టీ20లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. ఓపెనర్ సంజూ శాంసన్(82) మెరుపు ఆరంభాన్ని కొనసాగిస్తూ.. మిడిలార్డర్ బ్యాటర్లు ఎడాపెడా దంచేశారు. అయ్యర్, తిలక్‌ల జోరుతో నిర్ణీత ఓవర్లలో 249 రన్స్ కొట్టింది.
IND vs WI : రాంచీ టీ20లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. ఓపెనర్ సంజూ శాంసన్(82) మెరుపు ఆరంభాన్ని కొనసాగిస్తూ.. మిడిలార్డర్ బ్యాటర్లు ఎడాపెడా దంచేశారు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్(43), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(40)లు వెస్టిండీస్ బౌలర్లను చితక్కొట్టారు. ‘నేనేం తక్కువా’ అన్నట్టు తిలక్ వర్మ(44 నాటౌట్) డెత్ ఓవర్లలో సిక్సర్లతో హోరెత్తించాడు. సంజూ, ఇషాన్‌ల దూకుడుతో పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్ బాదిన టీమిండియా.. అయ్యర్, తిలక్‌ల జోరుతో నిర్ణీత ఓవర్లలో 249 రన్స్ కొట్టింది.
టీ20 సిరీస్‌లో అదిరే బోణీ కొట్టిన భారత్.. రెండో మ్యాచ్‌లో భారీస్కోర్ చేసింది. ఫామ్ చాటుకుంటూ ఓపెనర్ సంజూ శాంసన్(82) రెండో టీ20లో సునామిలా వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. యథేచ్ఛగా ఆడుతున్న శాంసన్.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగగా పవర్ ప్లేలో భారత్ రన్స్ కొట్టింది. అకీల్ హోసేన్ ఓవర్లో వరసగా 4, 6, 6, 4తో 22 పరుగులు పిండుకున్న సంజూ.. షెపర్డ్ వేసిన ఆరో ఓవర్లో బ్యా్క్ టు బ్యాక్ బౌండరీలతో అర్ధ శతకం సాధించాడు. దాంతో పవర్ ప్లేలో 79 రన్స్ చేసింది ఇండియా. ఫలితంగా ఈ ఫార్మాట వెస్టిండీస్‌పై గతంలో అత్యధిక స్కోర్‌గా ఉన్న 72 పరుగుల రికార్డు బద్ధలైంది.
6️⃣. 6️⃣. 6️⃣ 🚀
Absolute carnage from Tilak Varma 💥💥
Scorecard ▶️ https://t.co/mZlyaWZsoe
#TeamIndia | #INDvWI | @mflone_ | @TilakV9 https://t.co/95kMEXxtwO
— BCCI (@BCCI) October 9, 2026
అభిషేక్ శర్మ(20) ఔటయ్యాక దూకుడు పెంచిన సంజూకు ఇషాన్ కిషన్(43) అగ్నికి వాయువులా తోడయ్యాడు. దంచికొడుతున్న ఇషాన్‌ను ఔట్ చేసిన రోస్టన్ ఛేజ్(3-24)..ఆ తర్వాతి ఓవర్లో శివం దూబే(7)ను పెవిలియన్ చేర్చాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(40), తిలక్ వర్మ(44 నాటౌట్) పిడుగల్లే విండీస్ బౌలర్లపై పడ్డారు. దాంతో.. డెత్ ఓవర్లలో వీరి వీరకొట్టుడుకు విండీస్ బౌలర్లు బలవ్వగా.. ఏకంగా 80 రన్స్ వచ్చాయి. టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
HIGHEST T20I TEAM TOTAL IN RANCHI 🏟️
#TeamIndia put on a breathtaking show with the bat 👏
Scorecard ▶️ https://t.co/mZlyaWZsoe
#INDvWI | @mflone_ https://t.co/euZ4om6cvW
— BCCI (@BCCI) October 9, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chase
- IND vs WI
- Ishan Kishan
- Samson
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

