Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఆశించినంత త్వరగా గర్భం దాల్చకపోతే ఆందోళన పెరుగుతుంది. కొందరు దంపతులు కొన్ని నెలల్లోనే గర్భం దాల్చుతుండగా, మరికొందరికి తమ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్న అంశాలను తెలుసుకోవడానికి వైద్యుల మార్గదర్శకత్వం అవసరం అవుతుంది.
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఆశించినంత త్వరగా గర్భం దాల్చకపోతే ఆందోళన పెరుగుతుంది. కొందరు దంపతులు కొన్ని నెలల్లోనే గర్భం దాల్చుతుండగా, మరికొందరికి తమ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్న అంశాలను తెలుసుకోవడానికి వైద్యుల మార్గదర్శకత్వం అవసరం అవుతుంది. వయసు, నెలసరి ఆరోగ్యం, గతంలో గర్భధారణ జరిగిందా లేదా, ఇతర వైద్య సమస్యలు, భాగస్వామి పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలు గర్భం దాల్చడానికి పట్టే సమయాన్ని ప్రభావితం చేస్తాయి. ఫెర్టిలిటీ నిపుణుడిని ఎప్పుడు సంప్రదించాలో తెలుసుకోవడం ద్వారా దంపతులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను అర్థం చేసుకోవడంతోపాటు అనవసరమైన ఆలస్యాన్ని నివారించవచ్చు.
పూర్తిగా వేచి చూడవద్దు..
ఫెర్టిలిటీ నిపుణుడు డాక్టర్ పునీత్ రాణా అరోరా ప్రకారం ప్రతి దంపతులకు వర్తించే ఒకే విధమైన సమయ పరిమితి ఉండదు. ఫెర్టిలిటీ సమస్యల కోసం వైద్య సహాయం తీసుకోవాల్సిన సమయం వయసు, వైద్య చరిత్ర, గర్భం దాల్చడాన్ని ప్రభావితం చేసే సమస్యలు ఇప్పటికే ఉన్నాయా లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. 35 ఏళ్లలోపు మహిళలు 12 నెలల పాటు క్రమం తప్పకుండా, ఎలాంటి గర్భనిరోధకాలు ఉపయోగించకుండా లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ గర్భం దాల్చకపోతే సాధారణంగా ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. అయితే, సంతానోత్పత్తిపై ఇప్పటికే అనుమానం ఉన్నా లేదా గర్భధారణను ప్రభావితం చేసే వైద్య సమస్య ఏదైనా ఉన్నా, పూర్తి ఏడాది వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
ఈ వయస్సు ఉన్న మహిళలు అయితే..
35 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆరు నెలల పాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే ఫెర్టిలిటీ నిపుణులని సంప్రదించడాన్ని పరిగణించాలి. వయసు పెరిగే కొద్దీ సహజంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల ముందుగానే వైద్య సలహా తీసుకోవడం ద్వారా సమస్యలను గుర్తించి అందుబాటులో ఉన్న చికిత్సా అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలు చాలా నెలలు ప్రయత్నించిన తర్వాతే కాకుండా, అంతకంటే ముందుగానే ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోవడాన్ని పరిగణించవచ్చు. నెలసరి చక్రం అండోత్సర్గం, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ముఖ్యమైన సంకేతాలను అందిస్తుంది. క్రమం తప్పిన నెలసరి, తీవ్రమైన నెలసరి నొప్పులు లేదా నెలసరి పూర్తిగా రాకపోవడం వంటి సమస్యలు గర్భధారణను ప్రభావితం చేసే కొన్ని పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో గైనకాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ నిపుణులని ముందుగానే సంప్రదించడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
6 నెలల వెయిటింగ్ వద్దు..
దంపతుల్లో ఎవరికైనా సరే సంతానోత్పత్తిని ప్రభావితం చేసే వైద్య పరిస్థితి ఇప్పటికే ఉన్నట్లయితే ఆరు నెలలు లేదా ఏడాది పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని డాక్టర్ అరోరా చెప్పారు. ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్, గతంలో పెల్విక్ ప్రాంతంలో శస్త్రచికిత్స జరగడం, ఫాలోపియన్ ట్యూబ్‌లకు సంబంధించిన సమస్యలు, వీర్యకణాల పరీక్షలో అసాధారణ ఫలితాలు వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే వైద్యుడిని సంప్రదించడం ద్వారా మరిన్ని పరీక్షలు లేదా చికిత్స అవసరమా అనేది నిర్ణయించుకోవచ్చు. పలుమార్లు గర్భధారణ కోల్పోయిన దంపతులు ఫెర్టిలిటీ నిపుణులని సంప్రదించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వ్యక్తిగత పరిస్థితిని బట్టి హార్మోన్ల సమస్యలు, జన్యుపరమైన కారణాలు, గర్భాశయం లేదా ఇతర శరీర నిర్మాణ సమస్యలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు వంటి కారణాలను నిపుణులు పరిశీలిస్తారు.
వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా చికిత్స..
ఐవీఎఫ్ చేయించుకోవడానికి సిద్ధమయ్యే వరకు ఫెర్టిలిటీ నిపుణులని సంప్రదించాల్సిన అవసరం లేదు అనుకోవడం సరైంది కాదు. ఫెర్టిలిటీ నిపుణులు ఫెర్టిలిటీ పరీక్షల గురించి వివరించడంతోపాటు ఐయూఐ, ఐవీఎఫ్ వంటి చికిత్సా విధానాలను వివరిస్తారు. వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలి, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై కూడా సలహా ఇస్తారు. చికిత్స తప్పనిసరిగా అవసరమా లేదా సహజంగా గర్భం కోసం ప్రయత్నించడం కొనసాగించవచ్చా అనే విషయాన్ని కూడా సంప్రదింపుల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఫెర్టిలిటీ నిపుణులని సంప్రదించాల్సిన సమయం వయసు, నెలసరి చక్రం, వైద్య చరిత్ర, గత గర్భధారణలు, దంపతుల్లో ఎవరికైనా ఇప్పటికే ఉన్న సంతానోత్పత్తి సంబంధిత సమస్యలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 35 ఏళ్లలోపు మహిళ ఏడాది పాటు గర్భం కోసం ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే, 35 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉంటే ఆరు నెలల తర్వాత, 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటే ఇంకా ముందుగానే ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే నెలసరి క్రమం తప్పడం, పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు, గతంలో పలుమార్లు గర్భస్రావం జరగడం లేదా ఇతర ఆందోళనలు ఉన్న దంపతులు అంతకంటే ముందుగానే వైద్య సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

