సహజ కాన్పులపై గర్భిణులకు అవగాహన
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీలకు సహజ కాన్పులు అయ్యే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ.. గర్భిణీలు ప్రతినెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో...
అర్వపల్లి, నవంబర్ 17 : అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీలకు సహజ కాన్పులు అయ్యే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ.. గర్భిణీలు ప్రతినెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకోవాలని, ఉచితంగా మందులు, ల్యాబ్ పరీక్షలు,అందించడం జరుగుతుందని తెలిపారు. గర్భిణీలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. రక్తస్రావం, తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి, కాళ్ల వాపు వంటి సమస్యలు ఎదురైతే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మత శిశు ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన తల్లి ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మనిస్తుందన్నారు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ వ్యాయామం చేసినట్లయితే సహజ కాన్పు అవుతారని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సూచించిన విధంగా వ్యాయామం చేసినట్లయితే సహజ కాన్పులు జరుగుతాయన్నారు. సహజ కాన్పు వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆపరేషన్ అయినట్లయితే అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చు నాయక్, హెల్త్ సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు బోడ సునీత, మాధవి, మహేశ్, అనూష, శైలజ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సహజ కాన్పులపై గర్భిణులకు అవగాహన
Road Accident | ఆగివున్న టిప్పర్ను ఢీకొట్టిన వ్యాన్.. ముగ్గురు దుర్మరణం..!
Dhurandhar | ‘ధురంధర్’కి నిరాశ.. గ్రామీ నామినేషన్లలో చోటు దక్కని రణ్వీర్ సింగ్ చిత్రం
Show Cause Notices | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ..ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి పుష్పాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

