Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి పుష్పాభిషేకం
రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక మాసం 8వ రోజు మంగళవారం ప్రీతికరంగా మహాన్వితమైన రోజు ఉదయం నిత్యాన్నికా కార్యక్రమాలు నిర్వర్తించి రుద్రేశ్వర స్వామికి 11 లీటర్ల మధు(తేనే)తో అమృత అభిషేకం నిర్వర్తించారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 17: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక మాసం 8వ రోజు మంగళవారం ప్రీతికరంగా మహాన్వితమైన రోజు ఉదయం నిత్యాన్నికా కార్యక్రమాలు నిర్వర్తించి రుద్రేశ్వర స్వామికి 11 లీటర్ల మధు(తేనే)తో అమృత అభిషేకం నిర్వర్తించారు. సామూహిక రుద్రాభిషేకం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ కరుణాకర్, దీప్తి దంపతుల సౌజన్యంతో రుద్రేశ్వరస్వామికి రుద్రనామాలతో పుష్పాభిషేకం నిర్వర్తించి, సిరానైవేద్యం సమర్పించి, ద్వాదశ జ్యోతులతో మహా హారతి, డమరుక వాయిద్యాలతో శంకు నాదాలతో గంటా వాయిద్యాల మధ్య ఘనఘన గంటల మధ్య మహా హారతి నిర్వర్తించారు.
నీరాజనం అనంతరం మహా మంత్రపుష్పం నిర్వర్తించి భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి సన్నిధిలో కార్తీక సమారాధన వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు మణికంఠశర్మ, దత్త కుమార్‌శర్మ నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి పుష్పాభిషేకం
‘ఆర్ఎల్సీ అంగీకరించిన 24 డిమాండ్లను అమలు చేయాలి’
KTR | మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్.. బాడీగార్డ్‌గా మారిన రేవంత్ రెడ్డి : చిట్‌చాట్‌లో కేటీఆర్
Srinivas Goud | ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తారా ? దమ్ముంటే చేయండి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
చిల్డ్రన్స్ డే వేడుకల్లో ప్రకృతి ప్రేమికుడికి అపూర్వ గౌరవం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

