చిల్డ్రన్స్ డే వేడుకల్లో ప్రకృతి ప్రేమికుడికి అపూర్వ గౌరవం
పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న వాక్ ఫర్ ట్రీస్ వనజీవి విశ్వామిత్ర చౌహాన్‌కు చిల్డ్రన్స్ డే వేడుకల్లో అవార్డు అందించి ఘనంగా సత్కరించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి...
కొత్తగూడెం, నవంబర్ 17 : పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న వాక్ ఫర్ ట్రీస్ వనజీవి విశ్వామిత్ర చౌహాన్‌కు చిల్డ్రన్స్ డే వేడుకల్లో అవార్డు అందించి ఘనంగా సత్కరించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి మంగతార చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ‘మై డే.. మై రైట్స్.. మై ఫ్యూచర్’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా భావితరాలకు పచ్చని భవిష్యత్‌ను అందించేందుకు ప్రతిరోజూ మొక్కలు నాటుతూ, వాటిని సంరక్షిస్తున్న విశ్వామిత్ర చౌహాన్ సేవలను గుర్తించి ఈ గౌరవం అందించారు. జిల్లా సంక్షేమ శాఖ నుండి వరుసగా మూడో ఏడాది చిల్డ్రన్స్ డే సందర్భంగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం, పచ్చదనం పెంపునకు అందరినీ భాగస్వాములను చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చిల్డ్రన్స్ డే వేడుకల్లో ప్రకృతి ప్రేమికుడికి అపూర్వ గౌరవం
NTR | ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకేసారి రెండు సినిమాలు చేయనున్న తారక్?
KTR | కరువుతో ప్రజలు అల్లాడుతుంటే మూసీ సుందరీకరణ అవసరమా? కేటీఆర్
Money saving tips | ఏ నెల సంపాదన ఆ నెలలోనే నీళ్లలా కరిగిపోతున్నదా.. ఈ మనీ సేవింగ్ టిప్స్ మీ కోసమే..!
‘ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

