‘ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి’
ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి మాదిగలతో పాటు ఉప కులాలకు న్యాయం చేయాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (TMRPS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేశ్ మాదిగ అన్నారు. ఈ మేరకు మంగళవారం...
– వైద్య ఆరోగ్యశాఖ అధికారికి టీఎంఆర్పీఎస్ నాయకుల వినతి
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 : ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి మాదిగలతో పాటు ఉప కులాలకు న్యాయం చేయాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (TMRPS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేశ్ మాదిగ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ ఉద్దేశానికి అనుగుణంగా ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగ నియామకాల్లోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని, కేటగిరీల వారీగా ఉద్యోగాలు భర్తీ చేసి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన మాదిగలకు సముచిత అవకాశాలు కల్పించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు అమలయ్యేలా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జె.శ్రీనివాస్ మాదిగ, జిల్లా నాయకులు ఎస్ఎల్జీ శ్రీనివాస్ మాదిగ, బొమ్మెర అశోక్ మాదిగ, టేకుర్తి రాజు మాదిగ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి’
Akshara Singh | పెళ్లి కాకుండా ఛత్ పూజ చేస్తే తప్పేంటి?.. ట్రోలర్లకు భోజ్‌పురి నటి అక్షరా సింగ్ కౌంటర్!
‘యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం’
MS Dhoni: ఐపీఎల్‌కు మహీ రిటైర్మెంట్.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా ధోనీ
Harish Rao | సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులకు ఎగనామం.. మీ బోనస్ అంతా బోగస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

