Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
Newlywed Couple's Bodies | నూతన దంపతుల మృతదేహాలు ఒక నదిలో లభించాయి. వారిద్దరి కాళ్లకు గొలుసులు చుట్టి ఉన్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటను హత్య చేశారా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: నూతన దంపతుల మృతదేహాలు ఒక నదిలో లభించాయి. వారిద్దరి కాళ్లకు గొలుసులు చుట్టి ఉన్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటను హత్య చేశారా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Newlywed Couple’s Bodies) మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సావల్డే ప్రాంతంలోని నది అడుగున భార్యాభర్తల మృతదేహాలు లభించాయి. బయటకు తీయగా వారిద్దరి కాళ్లను ఇనుప గొలుసుతో చుట్టి దానికి తాళం వేసి ఉన్నది.
కాగా, మృతులను జల్గావ్ జిల్లా అమల్నేర్ తాలూకాకు చెందిన శ్యామ్ హరి పాటిల్, స్వప్నగా పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల కిందటే ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్నారు.
అయితే నూతన దంపతులను ఎవరైనా హత్య చేశారా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్నది తెలియలేదు. పోస్ట్‌మార్టం తర్వాతే వీరి మరణంపై స్పష్టత వచ్చే అవకాశమున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ జంట మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

