జనగామ, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : దేవాదుల నీళ్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకునే నాయకుడు లేడని, జిల్లా మంత్రులకు సమీక్షించే తీరిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. సోమవారం జనగా మ నియోజకవర్గ క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీళ్ల కోసం రైతులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ అసమర్థ పాలనతో వచ్చిన కరువు అని స్పష్టం చేశా రు. దేవాదుల ఓఅండ్ఎం కాంట్రాక్టర్‌కు రూ.7వేల కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించక 33 రోజులు మోటర్లు ఆన్ చేయని ఫలితంగా ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి తాను చేసిన తప్పును ప్రకృతి మీదకు నెట్టి తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారని, నీళ్లు ఇవ్వొద్దని మోటర్లకు అడ్డంగా హరీశ్‌రావు లేదా బీఆర్ఎస్ నాయకులు నిలుచున్నారా? అని నిలదీశారు. కేసీఆర్ సమ్మకసాగర్ బరాజ్ కట్టారని, మూడు నుంచి నాలుగు టీఎంసీల నీళ్లు ఇప్పటికీ అందులో ఉన్నాయన్నారు.
దేవాదుల ఫేజ్-3 కూడా పూర్తయిందని, ఆ మోటర్లు నడిపితే ఇంకా ఎకువ నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేసి, ఇరిగేషన్ మంత్రి, సెక్రటరీ వెంటపడి 30 రోజులకు రూ.7 కోట్ల నిధు లు విడుదల చేయించుకొని మోటర్లు రిపే ర్ చేయించారని మాజీ మంత్రి హరీశ్‌రా వు చెప్పారు. మోటర్లు బాగుంటే భీంఘన్‌పూర్, చలివాగు, ధర్మసాగర్, గండిరామా రం, బొమ్మకూరు నింపుకొని తపాస్‌పల్లి దాకా నీళ్లు తెచ్చుకునే వాళ్లమన్నారు. ఇప్పటికైనా దేవాదుల ఫేజ్-3 మోటర్లను వెం టనే ప్రారంభించి పంటలకు నీరందించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20 వేల సాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
గోదావరిలో సరిపడా నీళ్లుండి.. పైపులైన్లు, పంపులు, మోటర్లు, కాల్వలున్నా దేవాదుల ద్వారా రైతును ఆదుకోవాలన్న చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. గడిచిన 50 రోజుల్లో 40 రోజులు మోటర్లు ఆన్ చేయకుండా ప్రభుత్వం రైతుల పంటలను ఎండగొడుతున్నదని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని మండిపడ్డారు.
పంటలు ఎండుతుంటే ఆక్రోశంతో రైతులు ఆందోళనకు దిగారని, కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో రైతులు తనవద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారన్నారు. రైతుల కన్నీళ్లు, కష్టాలు తీర్చేందుకు తనవంతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అధికారులను నిలదీసినా చలనం లేదన్నారు. గ్రామాలకు వెళితే ఒక్కో రైతు గోడున విలపిస్తుంటే చూడలేక పోయానని, గత బీఆర్ఎస్ పాలనలో కాల్వలో పారిన నీళ్లను ప్రజలు, రైతులు గుర్తు చేసుకుంటున్నారని పల్లా తెలిపారు. సమావేశంలో నాయకులు సేవెల్లి సంపత్, బక్క నాగరాజు, పెద్ది రాజిరెడ్డి, బండ యాదగిరిరెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డ్డి, తాళ్ల సురేశ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.