దుగ్గొండి, మే 8 : అకాల వర్షానికి దెబ్బతిన్న 11వేల ఎకరాలకు సంబంధించి నష్టపరిహారం రూ.30కోట్లను వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో జమచేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పస, పరిజ్ఞానం లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సోమవారం మండలంలోని నాచినపల్లి, వెంకటాపురం గ్రామాల్లో పీఏసీఎస్‌ల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి పంట నష్టం వారంలోపే పంటలను పరిశీలించి ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన సీఎం దేశ చరిత్రలోనే కేసీఆర్ ఒక్కరేనన్నారు. నష్టపరిహారం పంపిణీపై ప్రతిపక్షాల మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. రైతుల ఆశీర్వాదమే సీఎం కేసీఆర్‌కు శ్రీరామరక్ష అన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కోమల, ఎన్నారై రాజ్‌కుమార్ శానబోయిన, తహసీల్దార్ సంపత్‌కుమార్, ఏడీఏ అవినాశ్ వర్మ, ఏవో చిలువేరు దయాకర్, రైతుబంధు సమితి జిల్లా బాధ్యుడు కాట్ల భద్రయ్య, నాచినపల్లి, మహ్మదాపురం పీఏసీఎస్‌ల చైర్మన్లు ఊరటి మహిపాల్‌రెడ్డి, సుకినె రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు హింగోళి రాజేశ్వర్‌రావు, మోడెం విద్యాసాగర్‌గౌడ్, ఎంపీటీసీ బండి జగన్, నగనబోయిన మమత, జంగా రాజిరెడ్డి, గుడిపెల్లి ధర్మారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు, నోడల్ అధికారి, ఏఈవోలు హన్మంతు, రాజేశ్, మధు, విశ్వశాంతి పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
నర్సంపేట : చిల్డ్రన్స్ లైబ్రరీ అండ్ లిటరసీ వ్యవస్థాపకుడు కాసుల రవికుమార్ ప్రారంభించిన హగ్ ఏ బుక్ చాలెంజ్ పోస్టర్‌ను ఎమ్మెల్యే పెద్ది ఆవిష్కరించారు. నర్సంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హగ్ ఏ బుక్ చాలెంజ్‌ను ప్రతి ఒక్కరూ స్వీకరించాలన్నారు.
భక్తిభావం పెంపొందించుకోవాలి
ఖానాపురం : ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న బ్రహ్మోత్సవాలను సోమవారం ప్రారంభించి అనంతరం కొత్తగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ ప్రకాశ్‌రావు, సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, మౌలానా పాల్గొన్నారు.