అవకాశాలు పెరగడం, తరగడం అనేది ఫలితాలను బట్టి ఉంటాయంటారు. కానీ ఈ విషయంలో శ్రీలీలను మాత్రం మినహాయించాలి. ఎందుకంటే.. తనకు ఫలితాలు చేదు అనుభవాలను ఇస్తున్నా.. అవకాశాలు మాత్రం పోటెత్తుతూనే ఉన్నాయి. బహుశా చందమామతో పోటీపడే ఆమె అందమే ఈ అవకాశాలకు కారణం కావొచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో అనురాగ్ బసు సినిమాలో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే ఇందులోని ఆమె పాత్ర గురించి అనురాగ్ బసు మాట్లాడారు.
ఈ సినిమాలో శ్రీలీల నటనకు ప్రశంసలు దక్కుతాయని, అంతేకాక, బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థల్లో తను అవకాశాలు దక్కించుకోవడం ఖాయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారి, శ్రీలీలకు మంచి మైలేజ్‌నే తెచ్చాయి. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌కు జోడీగా ఓ పానిండియా సినిమాలో నటిస్తున్నది శ్రీలీల. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక పవన్‌కల్యాణ్‌కు జోడీగా ఆమె నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా ఈ నెల 26న విడుదల కానున్న విషయం తెలిసిందే.