హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 10 : హనుమకొండ డబ్బాల నుంచి యాదవనగర్ వరకు మెయిన్ రోడ్డు(గోపాలరావు బిల్డింగ్ వైపు)కు సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. ఐదో డివిజన్ పరిధిలో మెయిన్ రోడ్డు వినాయకనగర్ లైన్లు సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ప్రజలు ఇబ్బందు పడుతున్నారని తేలిందన్నారు.
సమస్యలు పరిష్కరించడంలో కార్పొరేషన్ విఫలమైందని వారు విమర్శించారు. వీధిలైట్లు ఆరు నెలల నుంచి రావడంలేదని, కుమార్పల్లి, యాదవనగర్ నుంచి వచ్చే డ్రైన్ కాలువను రెగ్యులర్ తీయకపోవడంతో చెత్తపేరుకుపోయి డ్రైనేజీ వాటర్ పోకపోవడం దోమలు విపరీతంగా ఉన్నాయని, అనారోగ్యపాలవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. వర్షాకాలం వస్తే ఆ డ్రైన్ వాటర్ కొంతమంది ఇండ్లలోకి వస్తాయని వెంటనే ఆ డ్రైన్ కాలువను వెడల్పు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే గోపాలరావు ఫంక్షన్ హాల్ ముందు ఉన్నటువంటి చెత్త డబ్బు వలన ఇబ్బంది అవుతుందని అక్కడి నుండి తొలగించాలని అనేకసార్లు అధికార దృష్టికి తీసుకెళ్లిన నేటికీ పరిష్కారం కాలేదని విమర్శించారు. గ్యాస్ సబ్సిడీ ఎవరికి రావడం లేదని వారు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి, నార్త్ ఏరియా నాయకులు మంద మల్లేశం, స్థానికులు పాల్గొన్నారు.