బచ్చన్న పేట ఆగస్టు 28 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కదిలించిన ఉద్యమానికి విద్యుత్ అమరవీరుల పోరాటం ఊతమిచ్చిందని సీపీఎం మండల కమిటీ సభ్యులు మినాలాపురం ఎల్లయ్య అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని నాడు జరిగిన పోరాటంలో బషీర్బాగ్ విద్యుత్ అమరవీరులకు సీపీఎం బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లను చంద్రబాబు ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు.
నేటికి 25 సంవత్సరాలు గడిచిన అమరవీరుల స్ఫూర్తి వామపక్ష ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోదాసు సుధాకర్, గంగారబోయిన సమ్మయ్య, ఉప్పల గాలయ్య, రాళ్ల బండి కనకాచారి, కొమ్ము శిరీష రామగల్ల సుహాసిని, సీనియర్ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.