నల్లబెల్లి, మే 04 : ఈ నెల 20 న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ కార్యదర్శి కడియాల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి గవర్నమెంట్ కార్మిక పోరాటాల పైన,కార్మిక పాఠశాల పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ పోరాటాలను అనిచి వేస్తుందన్నారు. కార్మికులు సంఘటితం కాకుండా అనేక నిర్బంధ చట్టాలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సంస్థలన్నీటిని ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కంపెనీలకు దారా దత్తం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ విధానానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఆలిండియా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సంయుక్తంగా గ్రామీణ భారత్ బందును నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ బంద్కు కార్మిక, వ్యాపార వర్గాలు, రైస్ మిల్లర్లు అందరూ సహకరించిసమ్మెను జయప్రదం చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు కడియాల వీరాచారి, బొడిగె సమ్మయ్య, పల్లె రవి, గంగారపు లింగయ్య, బుడిగ నారాయణస్వామి, మేరకుర్తి సారయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.