భద్రకాళీ చెరువు పనుల్లో అవినీతి
వరంగల్ నగర ప్రజల జీవనాడిగా ఉన్న భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. పూడికతీత పనులు నెల ల తరబడి కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 29న ఓరుగల్లుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వస్తున్న నేపథ్యంలో శనివారం సాయం త్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడారు.
- ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పనుల్లో ఆలస్యం
- పూటికమట్టిని తరలించడంలో సాంకేతిక సమస్యలు
- మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
- 29న ఓరుగల్లుకు కేటీఆర్ రాక
- వరంగల్ తూర్పు బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం
- సర్, సభ్యత్వ నమోదుపై, సోషల్ మీడియా ప్రతినిధులకు దిశా నిర్దేశం
- మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
హనుమకొండ, జూన్ 27 : వరంగల్ నగర ప్రజల జీవనాడిగా ఉన్న భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. పూడికతీత పనులు నెల ల తరబడి కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 29న ఓరుగల్లుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వస్తున్న నేపథ్యంలో శనివారం సాయం త్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే భద్రకాళీ చెరువు ప నులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.
పనులు ప్రా రంభమై నెలలు గుడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాలేదన్నా రు. గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా పను లు నిలిచిపోయాయని చెప్తున్న ప్రభుత్వం, వానకాలం ముగిసిన తర్వాత కూడా పనులను వేగవంతం చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పూడిక మట్టిని తరలించడంలో సాంకేతిక సమస్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వల్ల పనులు ఆలస్యమయ్యాయని ఆ రోపించారు. వరద నీరు బయటికి వెళ్లక నగరంలోని పలుప్రాంతాలు ముంపునకు గురయ్యాయని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా వానకాలనికి ముందే పను లు పూర్తి చేయకపోతే గతేడాది పరిస్థితులే పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భద్రకాళీ చెరువులో వరుసగా జరుగుతున్న మునక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, తాజాగా, మరో యువకు డు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ప్రభు త్వ నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు కో ల్పోతున్నారన్నారు.
కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటున్న ప్రజా ప్రతినిధులు పనులు పూర్తి చేయించడంపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ ఏడాదైనా పాలకులు ముందస్తు చర్యలు తీసుకొని నగరం ముంపునకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవావలన్నారు. మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు దిడ్డి కుమార స్వామి, రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, సీనియర్ నాయకులు పులి రజినీకాంత్, నయీమొద్దీన్, కుడా మాజీ డైరెక్టర్ మోడం ప్రవీణ్, నాయకులు నర్సింహ రావు, గౌస్ ఖాన్, మూటిక రాజు యాదవ్, మనోహర్, సందీప్, వాసు, రమేశ్, సంతోష్, రాజు పటేల్, సుమిత్, అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

