ములుగు : రైతుల సమస్యలు ఎవరికి కనపడవా? ప్రాణాలు పోతేనే కనిపిస్తారా అని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్యను మొక్కజొన్న రైతులు నిలదీశారు. మొక్కజొన్న రైతుల సమస్యలను పరిష్కారించాలని గత 20 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరమర్శించేందకు వస్తారా అని నిలదీశారు.
సోమవారం వెంకటాపురం(నూగురు) మండల పరిధిలోని చిరుతపల్లిలో అత్మహత్య చేసుకున్న మొక్కజొన్న రైతులు మధుకృష్ణ, చంద్రారావు కుటుంబాలను ఆయన పరామర్శించారు. మధు కుటుంబానికి మొక్కజొన్న ఆర్గనైజర్ నుండి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సైయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.