వరంగల్, డిసెంబర్ 15: అవగాహనతోనే ఎయిడ్స్‌ను పూర్తిగా నియంత్రించొచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏవీవీ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్, టీబీపై గురువారం నిర్వహించిన క్విజ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌పై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
అనంతరం క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిని హారిక, సింధు, ద్వితీయ బహుమతిని సనా కళాశాల, తృతీయ బహుమతిని రంగశాయిపేట కళాశాల విద్యార్థి అందుకున్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది డాక్టర్ నర్సింహారెడ్డి, రామకృష్ణ, అనిల్‌కుమార్, ఏవో సదాలక్ష్మి, దామోదర్ పాల్గొన్నారు.