తొర్రూరు, ఫిబ్రవరి 6 : కాంగ్రెస్ మోసాలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం తొర్రూరు మున్సి పాలిటీలోని 6, 10, 11 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు రాయిశెట్టి మానస, రుద్రోజు విజయ భాసర్, కర్నె నాగరాజు గెలుపు కోసం విసృ్తత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలతో అధికారంలోకి వచ్చాడని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు.
రైతులకు యూ రియా కూడా దొరకని దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందని పేర్కొన్నారు. తొర్రూరు పట్టణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో అభివృద్ధి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ఒక పనికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శించారు. వృద్ధులు, వితంతు వులకు పింఛన్లు పెంచుతామని రేవంత్రెడ్డి మోసం చేశాడని, ఒకొకరికి రూ. లక్ష వరకు బకాయి ఉన్నాయని, అవి చెల్లిస్తేనే ఓటు వేస్తామని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపుని చ్చారు.
గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని జాతిపిత అంటున్నామని, అలాగే తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను జాతిపిత అనడంలో తప్పే ముందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరాం సుధీర్, ధరావత్ గాంధీనాయక్, ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.