Warangal | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 12 : బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ 5, 6 ,8 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సాబీర్ హోటల్ జంక్షన్ వద్ద నుండి జై బాపు…! జై భీమ్… జై సంవిదాన్…అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలోకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు,ప్రజలతో కలిసి రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రను ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. అహింస, శాంతి సిద్ధాంతాలను పాటిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకై అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని గాంధీజీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చేస్తున్న కుట్రల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగిందన్నారు. గాంధీజీ ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడానికి, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరియు దేశంలోని బిజెపి వంటి విచ్ఛిన్నకర శక్తులు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరజరిగిందన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏడాది కాలం పాటు రిలే నిరాహార దీక్షలు పాదయాత్రలు చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, వేముల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బి లక్ష్మన్, బొమ్మతి విక్రం, బంక సరళ ఏదులాపురం లక్ష్మన్, డివిజన్ ఇన్చార్జిలు కూర వెంకట్, బోడా దిన్నా, ఏ. నాగరాజు, డివిజన్ అధ్యక్షులు గాండ్ల స్రవంతి, అగర్దీది శివాజీ, తక్కలపల్లి మనోహార్, కోడిపాక్ గణేష్, అనిల్, గుత్తికొండ సురేందర్, అనిత, రాణి, ఇందిరా బొమ్మతి రాకేశ్, సయ్యద్ మన్నన్, కొంటె సుకన్యా, సురేష్ బాబు, సిరబోయిన సతీష్, మహమ్మద్ ఖుర్షీద్, ముప్పిడి శ్రవణ్ పాల్గొన్నారు.