హనుమకొండ, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల ఇసుక దందా జోరుగా సాగుతున్నది. స్టేషన్‌ఘన్‌పూ ర్ నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుం బ సభ్యుడి అండదండలతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నది. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. పట్టపగలే పొైక్లెన్లతో తవ్వడం, ట్రాక్టర్లతో ఒకచోట డంపింగ్ చేసి, అక్కడి నుంచి లారీల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాయగూడెం, తాటికాయల ప్రాంతంలోని నేరెళ్లవాగు ఒడ్డున అడ్డూ అదు పూ లేకుండా కొనసాగుతున్నది.
జేసీబీల సాయం తో మట్టి ఇసుకను ట్రాక్టర్లలో నింపి, ఆ పిదప నీళ్లతో శుభ్రం చేసి దానిని ఒక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి చిల్పూరు, తరిగొప్పుల రోడ్డు మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, వరంగల్ నగరానికి ప్రతిరోజు లారీల్లో తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 6,500 నుంచి రూ. 8 వేల వరకు అమ్ముతున్నారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులకూ నెలవారీ వాటాలు అందుతుండడంతో ఇష్టారీతిగా ధరలు నిర్ణయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు.
అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపే వాగులతోపాటు వీటి సమీపంలో ని అసైన్డు, పట్టా భూములను అధికార పార్టీ నాయకులు ముందుగానే కొనుగోలు చేసినట్లుగా కాగితాలు సృష్టిస్తున్నారు. భూముల యజమానులకు తక్కువ మొత్తం చెల్లించి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుండానే వందల లారీల ఇసుకను తవ్వుకుంటున్నారు. తవ్వకాల కోసం ఉపయోగించే ఒక్కో పొైక్లెన్ యజమాని ప్రతినెలా రూ. 50 వేలు, ట్రాక్టరు ఓనరు రూ. 5 వేల చొప్పున పోలీసు స్టేషన్లకు ముట్టజెపుతున్నారు.
ఇలా వరంగల్‌కు ఇసుక రవాణా అయ్యే రోడ్డులోని ప్రతి పోలీసు స్టేషన్‌కు ముడుపులు ఇస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరిపే మండలాల తహసీల్దారు ఆఫీసుకు వాటాల లెక్కలు వేరేగా ఉంటున్నాయి. భూమి విస్తీర్ణం, ఇసుక నిల్వ, తవ్వకాల పరిమాణం ఆధారంగా రూ. 5లక్షల వర కు సమర్పిస్తున్నారు. మైనింగ్ శాఖ వాటాలూ ఇలా గే ఉంటున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కాంగ్రెస్ కీలక ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుడి సహకారంతో ఈ దందా జరుగుతున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది.