వరంగల్ చౌరస్తా : ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే గొప్ప అన్నతీరుగా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు. గురువారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని కృష్ణ కాలేజ్ నూతన భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో నాయకుల తీరుతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమానంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్ భర్త శ్యామంతుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్, అతని సోదరుడు, ఆసీనులు కావడంపై అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం దృష్టి నిలపాలని మేధావులు, సీనియర్ సిటిజన్ లు, స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు.