తరిగొప్పుల, మార్చి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం జనగామలోని క్యాంప్ కార్యాలయంలో తరిగొప్పల మండలంలోని జాల్బాయ్తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పింగిలి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
చేరిన వారిలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సభావత్ రమేశ్, శ్రీనివాస్, భూక్యా తిరుపతి, జరుపుల రాములు, రాజు, భీముడు, కోడవత్ తిరుపతి, పరమేశ్, సూర్య, పూల్యా, ఈర్య, సంతోష్, గణేశ్, దాస్య తదితరులున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూక్యా జూంలాల్ నాయక్, తాళ్లపల్లి పోషయ్య, మాజీ సర్పంచ్ రాజు, ఏడెల్లి శ్రీనివాస్‌రెడ్డి, కొండ కుమార్ తదితరులున్నారు.