హసన్‌పర్తి, ఆగస్టు 2 : గ్రేటర్ 55వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. డివిజన్ పరిధిలోని భీమారం, రామారం, కోమటిపల్లికి చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారన్నారు. కొత్త, పాత అనే భేదం లేకుండా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
55వ డివిజన్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కోసం సైనికుడిలా పని చేసి, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. అంతకు ముందు కేయూ జంక్షన్ నుంచి భీమారం చర్చి వరకు కార్యకర్తలతో భారీ ర్యా లీ నిర్వహించారు. ఎమ్మెల్యేను కార్పొరేటర్ జక్కుల రజితా వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా సభ్యుడు విక్టర్‌బాబు, ఎర్రగట్టుగుట్ట ఆలయ చైర్మన్ చింతల లక్ష్మణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సుధాకర్, యూత్ అధ్యక్షు డు సాయి, గ్రామ అధ్యక్షుడు రాయికంటి సురేశ్, నాయకులు పోగుల రమేశ్, సంగాల చిన్న, దేశిని భరత్‌కుమార్, నమిడ్ల అరుణ్‌కుమార్, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.