రఘునాథపల్లి, మార్చి 6: బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరినందున అనర్హత వే టు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. పార్టీ ఫిరాయించిన శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కాలయాపన చేయడం విడ్డూరం గా ఉందన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. వీటిని తానే చేసిన ట్లు కడియం చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. కిందిస్థాయి నాయకులతో తనపై ఆరోపణ లు చేయించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులపై ఒత్తిడి తెచ్చి వారిని ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని రాజ య్య హితవు పలికారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను పార్టీలకతీతంగా గ్రామ పంచాయతీలకు కేటాయించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసాను సైతం ఎగ్గొట్టి అన్నదాతలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కడియం చేరిన సమయంలో వచ్చిన ఫొటోలు, వీడియోలన్నీ ఏఐ సృష్టి అని చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
రేవంత్‌రెడ్డి ఇప్పటికి 65 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ర్టానికి తెచ్చిన నిధులు శూన్యమన్నారు. తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేసి అభివృద్ధిని పాతాళానికి దిగజార్చారని అన్నారు. మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్, మాజీ ఎంపీపీ వై కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు దుబ్బాక హరీశ్‌గౌడ్, నాయకులు గూడ కిరణ్, ముప్పిడి శ్రీనివాస్; ద్వావర యాకయ్య, బండి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.