హనుమకొండ, నవంబర్ 20 : స్టేషన్‌ఘన్‌పూ ర్ నియోజకవర్గంలోని ఉప్పుగల్ రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో రూ.476 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వేయగా, కడియం శ్రీహరి రూ. 1001 కోట్లకు పెంచి తన అనుచరుడు జీవీఆర్‌కు కాంట్రాక్టు పనులు ఇప్పించి అవినీతికి తెరలేపాడని, దీనిపై విచారణ చేపట్టాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దాస్యం వినయ్ భా స్కర్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండేళ్లలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
అక్షరం ముక్కరాని నాయిని రాజేందర్‌రెడ్డి గ్లోబెల్ ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అభివృద్ధి నిధులు లేవని, వైద్య సేవలు అందడం లేదని బహిరంగంగా మాట్లాడే మాట లు నాయినికి వినబడడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుత్రి నిర్మాణ పనులు ప్రారంభించి 90 శాతం పనులు పూర్తి చేస్తే, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకరాకపోవడం సిగ్గు చేటన్నారు. సంక్షేమ పథకాల్లో కోతలు, గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలి ఆరోగ్య సేవలు అందక ప్రజలు చనిపోతుంటే సమీక్షలు చేయకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 57 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఒక్కనాడు ప్రజల సమస్యలపై కేంద్రా న్ని అడిగిన దాఖలాలు లేవన్నారు. రైతులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రోగులు చనిపోతే బాధిత కుటుంబాలతో రేవంత్ రెడ్డి మాట్లాడి న్యా యం చేశారా అని ప్రశ్నించారు.
పూర్తిస్థాయిలో వ రి కొనుగోళ్లు చేయడం లేదని, బోనస్ విషయం లో కడియం శ్రీహరి బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి 420 హామీ లు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామనడం సిగ్గు చేటన్నారు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని వారిని మోసం చేస్తున్నారన్నా రు. ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని.. ప్రజా కంఠపాలన అని అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానామసూద్, కార్పొరేటర్లు బొంగు అశోక్‌యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగరావు, సోదా కిరణ్, బీఆర్ఎస్ నాయకులు హరిరమాదేవి, పీ రజినీకాంత్, నయీమొద్దీన్, జానకీరాములు, శ్రీధర్‌రావు, మహేందర్, రవీందర్రావు పాల్గొన్నారు.
పత్తి రైతుల తరఫున పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా ప్రతిపక్ష నేతలపై విమర్శలా?. రైతుల బాధలు వినని నాయకులు, నాలుగు గోడల మధ్య ప్రెస్‌మీట్ పెట్టి హరీశ్‌రావుపై విమర్శలు చేశారు. చిరు వ్యాపారుల హక్కులను కాలరాస్తున్న నాయిని రాజేందర్‌రెడ్డి బస్టాండ్ వద్దకు గన్‌మెన్స్ లేకుండా రా. వరద బాధితులకు సాయం చేయకుండా అవమానించావ్. సహనం కోల్పోకు. ప్రజలకు సేవ చెయ్. నగరంలోని గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలి. ఇక్కడ దోచుకున్న డబ్బును విదేశాల్లో దాచుకొనేందుకే కదా అక్కడికి వెళ్లేది. ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్ అమలు చేయండి. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఉద్యమకారులు మహబూబాబాద్‌లో మహిమ గల రాళ్లతో ఏ విధంగా బుద్ధి చెప్పారో గుర్తు తెచ్చుకో. ఖబడ్దార్ రాజేందర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.
– దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నరు. రేవంత్‌రెడ్డి చేష్టలను ఇక్కడ నాయిని అమలు చేస్తున్నడు. రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంటే ఏసీ హాళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నరు. బీఆర్ఎస్, కేటీఆర్, హరీశ్‌రావు పోరాటంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. బెదిరింపులు, హత్యలు చేయడమే ఇందిరమ్మ పాలనా?. కాంగ్రెస్ హయాంలో రెండేళ్లలో రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాటితో ఏం చేశారో చెప్పాలి. రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు తెచ్చామంటున్నారు. వాటితో పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో రాజేందర్ రెడ్డి చెప్పాలి. విద్యార్థులు, రైతులు, ఆటో డ్రైవర్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అప్పుడే రాష్ట్రానికి పట్టిన శని పోతుంది.
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
హనుమకొండ : ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్రలు పన్నుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసులతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నది. ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన. పూటకో కేసు పేరు చెప్పి మా నాయకులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజా పోరాటం ఆపం. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే విచారణ లేదు. ఎస్ఎల్బీసీ కూలిపోయి కార్మికులు సమాధి అయితే వెలికితీత లేదు. విచారణ అంతకన్నా లేదు. ముఖ్యమంత్రిపై మంత్రి బిడ్డ విమర్శలు చేస్తే సమాధానం లేదు. మంత్రివర్గంలోని ఒక మంత్రి ఇంటిలో సీబీఐ రైడ్స్ జరిగితే దానిపై విచారణ ఉండదు. కానీ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో అగ్రభాగాన నిలిపిన కేటీఆర్ నిర్వహించిన ఈ రేసుపై విచారణ పేరుతో వేధిస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
– దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
జనగామ, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతును నొక్కేందుకే ఫార్ములా ఈ-కార్ రేస్‌లో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీ అధికారం చేతిలో ఉందని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షస ఆనందం పొందడం అప్రజాస్వామికం. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోైస్థెర్యాన్ని దెబ్బతీయలేరు. సీఎం కుట్రలను న్యాయపరంగా ఎదురొంటాం.
– బక్క నాగరాజు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు