తొర్రూరు ఫిబ్రవరి 2: గత బీఆర్ఎస్ ప్రభు త్వం తొర్రూరు పట్టణానికి మంజూరు చేసిన వంద పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణంపై వివాదం నెలకొన్నది. తొర్రూరులో నిర్మించాలని స్థానికులు కోరుతుండగా, స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి మాత్రం మడిపెల్లి గ్రామ సమీపంలో సర్వేనంబర్ 521 సుమారు 5 ఎకరాల భూమిలో నిర్మించేందుకు ప్రతిపాదనలు చేయడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి అనుబంధం గా ప్రభుత్వ దవాఖానను ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అత్యవసర సేవలు త్వరగా అందుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలో కి తీసుకోకుండా ఆస్పత్రిని మారుమూల ప్రాం తానికి తరలించడంపై స్థానిక నాయకులు, సా మాజిక కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తొర్రూరు పట్టణంలోనే వంద పడకల దవాఖాన నిర్మించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. కాగా, తొ ర్రూరు పట్టణంలో వంద పడకల దవాఖాన ని ర్మాణానికి గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు భూమిపూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.36 కోట్లు మంజూరు చేసింది. అన్నారం రోడ్డులో ఉన్న దేవుడి మాన్యం భూమిలో దవాఖాన నిర్మాణానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక శ్రద్ధ చూపారు. దేవాదాయశాఖతో చర్చ లు జరిపి సుమారు 6 ఎకరాల భూమిని ఆస్పత్రి కోసం అందుబాటులోకి తెచ్చారు.
తొర్రూరు పట్టణంలోనే వంద 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని కాంగ్రెస్ ఎమ్మె ల్యే యశ్వసినీరెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా నివాసాలకు సమీపంలోనే దవాఖానలు ఉంటే చిన్నపిల్లలు, వృద్ధులకు అత్యవసర చికిత్సలు సత్వరమే అందుతాయి. అనవసరంగా ఎక్కడో అడవిలోకి తరలించొద్దు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తుదినిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తాం.
– మంగళపల్లి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ