హనుమకొండ చౌరస్తా, జులై 5: సీనియర్ ఐపీఎస్ ప్రభాకర్ రావు నిజాయతీ, నిబద్ధత గల అధికారి అని వెలమ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన తాటిపర్తి ప్రభాకర్‌రావు 1987లో డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఇంటలిజెన్స్ శాఖ వరకు ఎదిగారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌ల్లో మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్న గొప్ప అధికారి కొనియాడారు.
నిబద్ధత గల సీనియర్ ఐపీఎస్ అధికారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తుందని వెంకటేశ్వర్రావు ఆరోపించారు. విచారణ పేరిట ప్రభాకర్ రావును ఇబ్బంది పెట్టడం సరైంది కాదని హితవుపలికారు. విధుల్లో భాగంగా అధికారులు ఆదేశించిన పనిని మాత్రమే ఆయన నిర్వర్తించారని తెలిపారు. ఎంరో ముఖ్యమంత్రుల వద్ద, అధికారుల వద్ద పనిచేసి వారి మన్నలను పొందారని, ఒక సిన్సియర్, సీనియర్ ఐపీఎస్ అధికారి 38 సంవత్సరాలుగా గొప్ప సర్వీస్ చేసిన వ్యక్తిని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.