కమలాపూర్, ఏప్రిల్ 5 : దళితబం దు రెండో విడుత నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. డబ్బులు వస్తాయని ఎన్నో రోజుల నుంచి ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టింది. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రెండో విడుత నిధుల కోసం లబ్ధిదారుల పక్షాన ప్రత్యక్ష పోరాటలకు దిగి, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో దళితుల్లో వ్యతిరేకత వస్తుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రెండో విడుత నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిం ది.
లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న ఫ్రీజింగ్ తొలగించి రుణా లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. అయినా, లబ్ధిదారులకు రుణాలు రాకపోగా, మళ్లీ రుణాలను నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దళితబందు ప థకంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని లబ్ధిదారులకు యూ నిట్లను మంజూరు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దళితబంధు రెండో విడత రుణాలను నిలిపివేసింది.
కమలాపూర్ మండలంలో 18 గ్రామాల్లో 654మంది లబ్ధిదారులకు రెండో విడుతలో రూ.15,57, 68,582 నిధులు మంజూరు కావాల్సి ఉండగా, ప్రభు త్వం అసెంబ్లీలో రెండో విడుత నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో కాంగ్రెస్ నాయకులు మేం సాధించామని నియోజకవర్గంలో సంబురాలు జరుపుకున్నారు. లబ్ధిదారులు కూడా కొండంత ఆశతో ఎదురుచూశారు. రెండో విడత రుణాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తీరా, అధికారులు నిధులు నిలిపివేశారని చెప్పడంతో చేసేదేమిలేక వెనుదిరిగి వెళ్తున్నారు. దళితబందు పథకంలో రెండో విడత డబ్బులు ఖాతాల్లో ప్రీజింగ్ చేసి ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నారు.
భూపాలపల్లి రూరల్ : మంథని నియోజకవర్గంలోని రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పులి రామన్న ఆధ్వర్యంలో లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 16 నెలల నుంచి దళితబంధు లబ్ధిదారుల రెండో విడుత నిధులు ఫ్రీజింగ్లో ఉన్నాయని, దానికి ఎత్తేసి దళితబంధు పథకాన్ని కొనసాగించాలని కోరా రు.
దళితులను మోసం చేయాలని చూస్తే ఊరుకోమని, రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ సూచనతో హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిప త్రం అందజేశారు. ఎమ్మార్పీస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య, రేగుంట నర్సయ్య, జిల్లా వరింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల సతీశ్, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శిలపాక హరీశ్ పాల్గొన్నారు.