Errabelli Dayakar Rao | హనుమకొండ/వర్ధన్నపేట/పర్వతగిరి, మే 8: కాంగ్రె స్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండల కేంద్రాలతో పాటు హనుమకొండలోని తన నివాసంలో ఐనవో లు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు, నగర పరిధిలోని 13 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ర్టాన్ని సమర్థవంతంగా పరిపాలించడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీయిస్తున్నదని అ న్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉ ద్దేశించి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనేలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దీంతో అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో నిజంగానే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినా పదేళ్లపాటుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పాలనా దక్షతతో ఎంతో ప్రగతి సాధించేందుకు కృషి చేశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రే వంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువా త క్రమంగా రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో పడిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సహా మంత్రులు కేవలం దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపుచ్చుకుంటున్నారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభు త్వం ఏవిధంగా విఫలమవుతుందో గమనిస్తున్నారని అన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, వారి కష్ట సుఖల్లో పలుపంచుకుంటానన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కు లేక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీలపై రేవంత్ రెడ్డి సమీక్షలు చేస్తున్నాడని, అన్నదాతల సమస్యలను పట్టించు కోవడం లేదన్నారు. అప్పులు పుట్టడం లేదని మాట్లాడడం అంటే సీఎంగా ఫెయిలయ్యారనే అర్థమన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోళ్లలో ఎన్నడూ ఇంత ఆలస్యం జరగ లేదని, కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రైతుల నుంచి తరుగు పేరుతో 5 కేజీల ధాన్యం కట్ చేస్తుందని మండిపడ్డారు.
సమావేశంలో బీఆర్ఎస్ వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, మండల ఇన్చార్జులు ఎల్లావుల లలితాయాదవ్, చింతల యాదగిరి, మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, నాయకులు సిలువేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, కోమాండ్ల ఎలేందర్రెడ్డి, కొండేటి శ్రీనివాస్, కంజర్ల మహేశ్, గోదుమల మధు, మనోజ్ కుమార్, చింతపట్ల సోమేశ్వర్ రావు, చిన్నపాక శ్రీనివాస్, గటిక మహేశ్, చింతల శ్రీనివాస్, దర్నోజు దేవేందర్, మట్టపెల్లి మాధవరావు, డబ్బేట యాలాద్రి, నరేశ్, జంగిలి బాబు, మసాని వెంకట్, విజయ, రాపాక శేఖర్, రంగు కుమార్, రాపాక మధు, బొట్ల భాసర్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, మాజీ సర్పంచులు ఏర్పుల శ్రీనివాస్, కొల్లూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.