పెద్దవంగర/ తొర్రూరు/ కొడకండ్ల/ రాయపర్తి, నవంబర్ 25 : ‘బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక దుర్మార్గుడి చేతిలో రాష్ట్రం నాశనం అవుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాల్లో గెలిచేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం పెద్దవంగర, తొర్రూరు, కొడకండ్ల, రాయపర్తిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతు కష్టాలు తీర్చడం లో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు.
ఎరువులు కావాలంటే.. పంటలు అమ్మాలంటే ఆంక్షలు పెడుతూ అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటకు గిట్టుబాటు ధరలను కల్పించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదే అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయామని బాధపడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం మొదలైందని.. స్థానిక ఎన్నికలపై సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయని పేరొన్నారు. ప్రతి కార్యకర్త సైని కుడిలా పనిచేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎండగడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎన్నిక ఏదైనా బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే 90 శాతం గెలవడం ఖాయమన్నారు. ఐకేపీలో రూ. 450 కోట్లు అప్పు తీసుకొని, మహిళా సంఘాల ఖాతా నుంచి డబ్బులు కట్ చేసి వారి డబ్బులతోనే వారికి చీరలు ఇస్తున్న ప్రభుత్వమిదని ఎర్రబెల్లి విమర్శించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పూర్తిగా మోసపూరితమైందన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు రాజుల్లా జీవించారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కాగా, రాయపర్తి మండలం లోని మైలారంలో 50 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సహకారంతో శ్రీనివాస్‌రెడ్డి సమకూర్చగా ఎర్రబెల్లి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డిని దయాకర్‌రావు అభినందించారు. బీఆర్ఎస్ పెద్దవంగర, కొడకండ్ల మండల అధ్యక్షులు ఐలయ్య, సిందే రామోజీ, మండల ఇన్చార్జి రంగు కుమార్‌గౌడ్, కార్యదర్శి సంజయ్, మాజీ అధ్యక్షుడు యాదగిరిరావు, దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ, నాయకులు సుధీర్‌కుమార్, వెంకన్న, రఘు, సమ్మయ్య, సుధాకర్, షర్ఫుద్దీన్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, వీరన్నయాదవ్, పటేల్ నాయక్, వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సత్యనారాయణ, చంద్రయ్య, కుమార్, హరీశ్‌యాదవ్, జిను గు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, లేతాకుల రంగారెడ్డి, కర్ర రవీందర్‌రెడ్డి, నాగపురి రాంబాబు, కుందూరు రాంచంద్రారెడ్డి, గుగులోత్ జాజునాయక్, బందెల బాలరాజు, జక్కుల వెంకట్‌రెడ్డి, చిట్యాల వెంకటేశ్వర్లు, వంగాల నర్సయ్య, తోట నర్సింగం, మహ్మద్ అక్బర్, ముద్రబోయిన సుధాకర్, బండారి అశోక్‌కుమార్, కుంట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.