పోచమ్మమైదాన్, జనవరి 28: కాకతీయ యూనివర్సిటీ, వల్లంపట్ల ఆర్ట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 30, 31న వల్లంపట్ల సాహిత్యం-సామాజిక చైతన్యం అంశంపై రెండు రోజులపాటు కేయూలోని కామర్స్ సెమినార్ హాల్లో జాతీయ సదస్సు ఉంటుందని తెలుగు విభాగాధిపతి, సదస్సు సంచాలకులు అచార్య బన్న ఐలయ్య తెలిపారు.
సదస్సులో తెలుగు సాహిత్య విద్యార్థులు, కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.