Collector signature forgery | సుబేదారి : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహారావు, నిందితుడిని అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు.
ఏసీపీ కథనం ప్రకారం.. వరంగల్ నగరం రామన్నపేట కు చెందిన మంద కళ్యాణ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పబ్లిక్ హెల్త్ జవాన్ గా పనిచేసేవాడు. డబ్బులు సంపాదించాలనే ఆశతో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అతడు కూరపటి కిరణ్, మంద వంశీ తో కలిసి 40 మంది వద్ద రూ.16లక్షల,14 వేలు వసూలుకు పాల్పడ్డాడు.
వరంగల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, అపాయిట్ మెంట్, సర్వీస్ బుక్స్ తయారుచేసి మోసాలకు పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో ప్రధాన నిందితుడు మంద కళ్యాణ్ ను సోమవారం అరెస్ట్ చేసి, అతడి నుంచి కారు, బైక్, 39 నకిలీ సర్వీస్ బుక్స్, 23 ఫెక్ ఆపాయిట్ మెంట్ ఆర్డర్ కాఫీలు, స్టాంపులు, కలర్ టీవీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.