ములుగురూరల్ : సంక్షేమ పథకాల లబ్దిదారులతో పాటు రైతులకు బ్యాంకర్లు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు, వానకాలం సీజన్లో పంటలు పండించే రైతులకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లు రుణాల మంజూరీలో సహకరించాలని అన్నారు.
రాజీవ్ యువ వికాస పథకానికి ఎంపికైన లబ్ధిదారుల జాబితా బ్యాంకులకు వచ్చిన వెంటనే యూనిట్లను గ్రౌండింగ్ చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, రిజర్వు బ్యాంకు ప్రతినిధి గోమతి, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, ఎస్బీఐ రిజనల్ మేనేజర్ సుబ్బారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, డీసీఓ సర్దార్‌సింగ్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.