ఖిలావరంగల్, జూలై 20: కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు టౌన్షిప్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆమె మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
టౌన్షిప్లో మౌలిక వసతులు, క్రీడా మైదానం, కమ్యూనిటీ హాల్, స్కూల్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి అందించాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఇన్చార్జి ఆర్డీవో కృష్ణవేణి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీర స్వామి, ఈఈ సునీత, ఆర్అండ్బీ అధికారి జితేందర్‌రెడ్డి, నటరాజ్ పాల్గొన్నారు.