గీసుగొండ ఫిబ్రవరి 25: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్ పాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోతో పాటు అప్పర్ ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ సత్య శారద( Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం(Mid-day meal )తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్నభోజనం లేకపోవడంపై ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
వంట తయారు చేసే సమయంలో పాత్రల శుభ్రం చేసుకోవాలని వాటిపై మూతలు పెట్టుకోవాలన్నారు. తమ ఇష్టానుసారంగా మధ్యాహ్న భోజనం తయారు చేస్తే విద్యార్థులకు ఏదైనా సమస్య వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఈఓ జ్ఞానేశ్వర్, ఎంఈఓ సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.