రాయపర్తి : మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు యాసింగిలో సాగు చేసిన వరి పంటలకు సాగు జలాల సమస్యలు రానివ్వొద్దని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద(Satya Sarada) అధికారులను ఆదేశించారు. మంగళవారం తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోత్ కిషన్ నాయక్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఎస్సారెస్పీ డీఈ కిరణ్ కుమార్ తదితర అధికారుల బృందంతో కలిసి ఆమె మండలంలోని మైలారం బ్యాలెన్స్ రిజర్వాయర్ లో నిల్వ ఉన్న నీరు, రైతులు సాగు చేసిన వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం అధికారులతో కలిసి ఆమె మండలంలోని మహబూబ్నగర్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని బొజ్జన్న కుంటలోకి ఎస్సారెస్పీ జలాలను తరలించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గిర్ధావర్ కొయ్యాడ చంద్రమోహన్, ఎంపీఓ కూచన ప్రకాష్, ఎస్సారెస్పీ ఏఈలు బానోత్ బాలదాసు, మల్సూర్ నాయక్, నంద కిశోర్ తదితరులు పాల్గొన్నారు.