న్యూఢిల్లీ, మార్చి 17: విపక్షానికి చెందిన 8 మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్ను లోక్సభ మంగళవారం రద్దు చేసింది. స్పీకర్ ఓం బిర్లా తమ సస్పెన్షన్ను రద్దు చేసిన తర్వాత విపక్ష ఎంపీలు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. బడ్జెట్ సమావేశాల్లో నిరసనల సందర్భంగా అనుచిత ప్రవర్తనకు పాల్పడిన 8 మంది ఎంపీలపై ఫిబ్రవరి 3న స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో కాంగ్రెస్కు చెందిన ఏడుగురు, సీపీఎంకు చెందిన ఒకరు ఉన్నారు. మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించిన ఓ తీర్మానం ద్వారా సభ్యుల సస్పెన్షన్ను లోక్సభ రద్దు చేసింది. మరోవైపు సభలో ప్లకార్డులు, పోస్టర్లు, ఏఐతో రూపొందించిన చిత్రాలను భవిష్యత్తులో ప్రదర్శించవద్దని స్పీకర్ సభ్యులను కోరారు.