బచ్చన్నపేట జూన్ 06 : భూభారతి రెవెన్యూ సదస్సులతోనే రైతుల భూ సమస్యలు పరిష్కరించబడతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని కొన్నె గ్రామ రైతు సదస్సులో అయన పాల్గొని మాట్లాడారు. రైతులు భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 అమల్లో భాగంగా మండలంలోని రెవెన్యూ గ్రామాలలో భూభారతి రైతు సదస్సులను గ్రామాల వారీగా నిర్వహిస్తామన్నారు.
రైతులు తమ భూమి రికార్డుల తప్పులను, అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల యందు పేర్లు నమోదు కాకపోయినా మరే ఇతర భూ సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకుంటే క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించిన తదుపరి భూసమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్నెలో రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ ఫణి కిశోర్ ఎంఆర్ఐ వంశీకృష్ణ , ఏఆర్ఐ మునివర్, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్, గ్రామ రైతులు పలువురు పాల్గొన్నారు.