హనుమకొండ, జూన్ 16 : సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 4,730 మంది అభ్యర్థులకు హనుమకొండలో 11 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 9:30 గంట ల నుంచి జరిగిన పరీక్షకు 2,637 మంది (55.75 శాతం) హాజరు కాగా, 2,093 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి జరిగిన పరీక్షకు 2,614 మంది (55.26 శాతం) హాజరయ్యారని, 2,116 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. యూపీఎస్సీ సెంట్రల్ అబ్జర్వర్ హరిహరరథ్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, సీడీసీ డీమ్డ్ యూనివర్సిటీ, ఢిల్లీ పబ్లిక్ సూల్, వడ్డేపల్లిలోని పింగిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీ, న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఏఎస్ఆర్ నేషనల్ హైసూల్, మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.