హనుమకొండ మే 8 : త్రైమాసిక తనిఖీలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం ఎనుమాముల మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాంను తణిఖీ చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపబడే పిరియాడికల్ తణిఖీ నివేదిక సందర్భంగా ఈవీఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డు హాజరు, సమయపాలన రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు.
ఈవీఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వర్తించే పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సీపీటీవీ కెమెరాల ద్వారా పరిశీలిస్తుండాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.