సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. రాష్ట్ర సచివాలయం, అమర జ్యోతి మధ్యలో తెలంగాణకు సంబంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పా టు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్‌లో మంగ ళ వారం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలా భిషేకాలు నిర్వహించారు.
నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 17: హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమానికి కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబో యే రోజుల్లో అకడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కచ్చితంగా ప్రతిష్టించి తీరుతామని అన్నారు. పరకాల బస్టాండ్ సెంటర్లో, హసన్‌పర్తి మండలంలోని జయగిరి, సీతంపేట 65 డివిజన్ చింతగట్టులో, వరంగల్ జిల్లా రాయ పర్తి మండలంలోని శివరామపురం, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరిలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించా రు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తొర్రూరు, పెద్దవంగర, జనగామ జిల్లాలో పాలకుర్తి, స్టేషన్‌ఘన్ పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, కొడకండ్ల, భూపాలపల్లి జిల్లా గణపురం, ములుగు జిల్లా ఏటూరునాగారం తదితర మండల కేంద్రాల్లో గులాబీ శ్రేణులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశాయి.
మహబూబాబాద్ రూరల్ : ఉద్యమకారుల చరిత్రను లేకుండా చేసే విధానాలను కాంగ్రెస్ పార్టీ మానుకోకపోతే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. హైదరాబాద్ సెక్రటేరియెట్ ఒక చరిత్రాత్మక ప్రదేశమని, అక్కడ రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై యావత్ ప్రజానీకం, మేధావులు సీఎం రేవంత్‌రెడ్డిని అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది అసువులు బాసారని, వారి చరిత్రను విస్మరించేలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరిగేలా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, వెంకన్న రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.