ఐనవోలు, జనవరి 9 : ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు ఆహ్వానించారు. ఈమేరకు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి మల్లన్న చిత్రపటం, ఆహ్వాన పత్రిక, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఇక్కడ ఉప ప్రధాన అర్చకుడు రవీందర్, వేదపండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, జూనియర్ అసిస్టెంట్ అద్దంకి కిరణ్‌కుమార్ ఉన్నారు.