హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ ఎగ్జిబిషన్ కౌంటర్‌ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి విశ్వవిద్యాలయ అభివృద్ధిని అభినందించారు. గోల్డెన్ జూబ్లీలోకి అడుగిడుతున్న విశ్వవిద్యాలయానికి గుడ్ విషెస్ తెలిపారు. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయంలో విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్ నిర్వాహణను వారు అభినందించారు.
విశ్వవిద్యాలయ సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో వేస్ట్ టు వెల్త్ గురించి తెలుసుకున్నారు. సెరికల్చర్ విభాగ అధ్యాపకురాలు డాక్టర్ సుజాతను కొన్ని సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం సూచనలమేరకు ఈ ఎగ్జిబిషన్ కౌంటర్ నిర్వహణను డాక్టర్ కే.సుజాత, రాము బన్నూర్కర్, సిహెచ్.ప్రవీణ్‌కుమార్ ఏర్పాటు చేశారు.