నల్లబెల్లి, డిసెంబర్8: హర్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగి ఏడాదైనా పనులు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామ పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్ స్థలం వద్ద పెద్దితోపాటు బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు నిరసన వ్వక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి అనుసంధానంగా ఉండేలా నాటి సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో తాను ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేయించానని తెలిపారు. ఈ స్టేషన్ ద్వారా మిర్చి, పసుపు, కాయగూరలతో పాటు పండ్ల తోటలతోపాటు ఆయిల్ పామ్ లాంటి పంటలపై పరిశోధన, సీడ్ తయారీకి ఎంతగానో దోహద పడుతుంద న్నారు. అత్యంత ప్రాధాన్యత కల్గిన హర్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్‌ను మంజూరు చేస్తే ఎమ్మెల్యే ఏడా ది పూర్తయినా పనులు ప్రారంభించక పోవడం శోచనీయమన్నారు.
ఆయనకు అభివృద్ధిపై ఓ విజన్ లేదు కనీస అవగాహన లేదని ఆరోపించారు. పలుమార్లు ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి కి లేఖలు రాసినా ఫలితం లేదన్నారు. ఇకనైనా నెల రోజుల్లో హార్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్ పనులు ప్రారంభించకుంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ సర్పంచ్ తంగెళ్ల నిర్మల, నాయకులు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, హరినాథ్‌సింగ్, కొత్తపల్లి కోటిలింగాచారి, నూనావత్ వెంకన్న, మామిడిశెట్టి రవి, పల్నాటి మూర్తి పాల్గొన్నారు.