వరంగల్, మే 2 : వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం పారిశుధ్య కార్మికులు పాలాభిషేకాలు చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.వెయ్యి వేతనం పెంచిన సందర్భంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో గ్రేటర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారిశుధ్య కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ అర్బన్ అధ్యక్షుడు బోగి సురేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు పారిశుధ్య కార్మికులు రుణపడి ఉంటారని అన్నారు. కార్మిక పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ మూడు పర్యాయాలు పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచారన్నారు. కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులు అందించిన సేవలకు రూ.5వేలు బోనస్ ఇచ్చారని గుర్తుచేశారు. కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కార్మికుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్టీయూ అధ్యక్షుడు కొత్తకొండ శ్రీనివాస్, కార్యదర్శి గాదె కుమార్, హనుమకొండ అధ్యక్షుడు నద్దునూరి రాజేశ్‌ఖన్నా, వివిధ విభాగాల అధ్యక్షులు పడాల రామ్మూర్తి, మేకల సమ్మయ్య, ఆదాం, చెరుకు సుధాకర్, శ్రీనివాస్, రాజు, సాంబయ్య, రాజేశ్, సత్యనారాయణ, కర్ణాకర్ పాల్గొన్నారు.
నల్లబెల్లి గ్రామంలో..
వర్ధన్నపేట : మండలంలోని నల్లబెల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి మాట్లాడుతూ గ్రా మాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉం చడం కోసం పారిశుధ్య కార్మికులు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రధానం గా కరోనా సమయంలో వారు చేసిన సేవలను వెలకట్టలేమన్నారు. ప్రజల కోసం పనిచేసే కార్మికుల కుటుంబాలకు చేయూతనిచ్చేలా సీఎం కేసీఆర్ వేతనాల ను పెంచడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచ్ ముత్యం దేవేంద్ర, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, ఉపసర్పంచ్ చంద్రయ్య పాల్గొన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : శాయంపేటలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ చిత్రపటానికి పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెంబర్తి రాజు, మండల అధ్యక్షుడు చిలువేరు మల్లేశం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులను గుర్తించి, మరోసారి వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు యాకయ్య, మోహన్, రమేశ్, సూర్యప్రకాశ్, సాంబయ్య, చిత్తం లక్ష్మి ,పుష్ప, సరోజన, గీత పాల్గొన్నారు.