రేపు భూపాలపల్లికి ప్రగతి ప్రదాత
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతుగా భూపాలపల్లిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.
- ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వెనుక ఏర్పాట్లు
- సభా స్థలి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీ సారయ్య, జిల్లా అధ్యక్షురాలు జ్యోతి
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతుగా భూపాలపల్లిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. శుక్రవారం సీ ఎం కేసీఆర్ మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పా ల్గొంటారు. ఈ మేరకు భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వెనుక గల ఖాళీ స్థలంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సభా స్థలి పనులు ప్రారంభం అయ్యాయి. బుధవారం ఎ మ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షురాలు గండ్ర జ్యోతి, నియోజకవర్గ ఇన్చార్జి బ స్వరాజు సారయ్య ఏర్పాట్ల ను పరిశీలించారు.
విజయవంతం చేయాలి
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
ఈ నెల 24న భూపాలపల్లిలో జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె నాయకులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గం టలకు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటార ని, లక్ష మంది హాజరుకానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్ర జలు బీఆర్ఎస్కు గ్రామగ్రామాన బ్రహ్మరథం పడుతున్నారని, ఈ క్రమంలోనే కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహించినా వి జయవంతం అవుతున్నదన్నారు. కేసీఆర్ పథకాలపై ప్రజ లు సంతోషంగా ఉన్నారని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ప్రజలను సభా స్థలికి తరలించేలా శ్రేణులు కృషి చేయాలన్నారు. ఆ మె వెంట పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌యాదవ్, కౌన్సిలర్ స్వామి, బీఆర్ఎస్ అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, నాయకులు బీబీ చారి, సింగనవేని చిరంజీవి, అల్లూరి కుమార్, బెడ్డెల పోశయ్య, తిరుపతమ్మ, స్వప్న, బోడ పద్మ, వజ్రమణి తదితరులున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

