దేవరుప్పుల/స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 19 : పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం హైదరాబాద్లో బీ ఫారాలు అందించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.