Jeevan Reddy | ప్రజావాణిలో జీవన్ రెడ్డి లేఖకు స్పందన.. పెట్రోల్ బంక్ ఏర్పాటుపై కదలిక..!
Jeevan Reddy : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి 'ప్రజావాణి'లో ఇచ్చిన వినతి పత్రంపై కలెక్టర్ బి.సత్యప్రసాద్ స్పందించారు.
Jeevan Reddy : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రజావాణిలో ఇచ్చిన వినతి పత్రంపై కలెక్టర్ బి.సత్యప్రసాద్ స్పందించారు. జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుపై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్ కుమార్‌కు కలెక్టర్ లేఖ రాశారు. జీవన్ రెడ్డి చేసిన అభ్యర్థనపై వెంటనే విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.
పాత బస్టాండ్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సెప్టెంబర్ 7 న జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్‌లో విశాలమైన స్థలం అందుబాటులో ఉందని, అక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే వాహనదారులకు సైతం సౌకర్యంగా ఉంటుందని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమార్థం అక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలిచి మూడేళ్లు అవుతుందని, ఇంకా ఆలస్యం చేయొద్దని జీవన్ రెడ్డి లేఖలో రాశారు. ఆయన లేఖకు స్పందించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఉత్తరం రాశారు. వ్యక్తిగతంగా విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం పోలీసుల ఆధ్వర్యంలో బంక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

